ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కంటే ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాస్తే వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్నే పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల సమాధానాలను తొలగించనుంది. కాగా, ఈ నెల 19 నుండి 26 వరకు టెన్త్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరగనుంది. మే రెండవ వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.