మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు తాజాగా బీహార్‌లోనూ పరువునష్టం కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ పాట్నా కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ ఆయనపై పరువు నష్టం దావా వేశారు. అయితే, 12న విచారణకు హాజరుకావాల్సి ఉండగా, బిజీగా ఉండడంతో రాలేరని రాహుల్ న్యాయవాదులు కోర్టును కోరగా ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.