దేశంలోని 30 రాష్ట్రాల సీఎంలలో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ప్రకటించింది. ఇందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.510 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15 లక్షలతో చివరి స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రులు సమర్పించిన వ్యక్తిగత ఎన్నికల ప్రమాణ పత్రాలు పరిశీలించిన అనంతరం ఏడీఆర్ ఈ వివరాలు తెలిపింది.