ట్విట్టర్ లో 80శాతం ఉద్యోగులను తొలగించిన్నట్లు ఆ కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. మొత్తం 8వేల ఉద్యోగుల్లో ప్రస్తుతం 1500 మంది మాత్రమే ఉన్నారు. అక్టోబర్ 2022 నుంచే కంపెనీలో ప్రక్షాళన చేపట్టారు. ఉద్యోగుల తొలగింపుపై మస్క్ మాట్లాడారు. ఉద్యోగుల తొలగింపు సరదా కాదని, బాధాకరమైన విషయం అన్నారు. ట్విట్టర్ కు 44 బిలియన్ల డాలర్లు చెల్లించానని, ఇప్పుడు దాని విలువ సుమారు 20 బిలియన్ల డాలర్లు ఉందన్నారు.