ఓ కలెక్టర్ కింద స్థాయి ఉద్యోగిని తన బూట్లు తీసుకెళ్లమని కోరడం వివాదాస్పదంగా మారింది. తమిళనాడు కళ్లకురిచి కలెక్టర్ శ్రావణ్ కుమార్ జాతావత్ ఓ ఆలయంలోకి ప్రవేశించే ముందు తన బూట్లు తీసుకెళ్లమని అసిస్టెంట్ ను కోరగా, అతను తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా విమర్శలు వచ్చాయి. కలెక్టర్ దీనిపై స్పందిస్తూ, అది నిజం కాదని ఆ వీడియో ఎడిట్ చేశారని, తప్పుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.