నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ బండి ఆత్మకూరు మండలం బి కోడూరు గ్రామాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనీఖి లో బాగంగా ఫ్యామిలీ ఫిజీసియన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఫ్యామిలీ ఫిజీసియన్ కార్యక్రమాన్ని ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా పకడ్బందీగా నిర్వహించాలని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మరియు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ గర్భవతులకు, బాలింతలకు సకాలంలో వైద్య సేవలు అందించాలన్నారు. గ్రామములో ఇంటి దగ్గర ఉన్నటువంటి తొట్టెలు మరియు డ్రమ్ములలో నిల్వ ఉన్నటువంటి నీటిలో లార్వాలను మరియు వాటికీ సంభందించిన గ్రుడ్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమములో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కాంతారావు నాయక్, వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.