ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని విజయవాడలో బుధవారం మర్యాదపూర్వకంగా బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ భేటీ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. క్షేమ సమాచారాలతో పాటు పలు రాజకీయ అంశాలను వారు మాట్లాడుకున్నారు.