కేంధ్ర ఉక్కు గ్రామీనాభివృద్ది శాఖ సహాయక మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కి విశాఖ విమానాశ్రయంలో ఘణ స్వాగతం లభించింది. ఈమేరకు గురువారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపి జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి, గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ మరియు విమానాశ్రయం సలహాదారు కమిటీ సభ్యులు కరణంరెడ్డి నరసింగరావు, రాష్టృ ప్రోటోకాల్ కన్వీనర్ బాల. రాజేశ్వరరావు, జిల్లా ప్రదాన కార్యదర్శి పొలిమేర శ్రీను, దానేష్, ఉక్కునగరం మండల అధ్యక్షులు నాగేశ్వరరావు , ఉక్కుకర్మాగార సిఎండి అతుల్ బట్ , రైల్వే విశాఖ డిఆర్. ఎం అనూప్ కుమార్ సత్పతి తదితరులు పుష్ప గుచ్చాలు ఆందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న క్లాసిక్ ఆఫీసర్స్ అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు.