రవాణా శాఖ ఆదాయ ఆర్జన(పన్నుల వసూలలో)లో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని విశాఖ రవాణా ఉప కమిషనర్ రాజారత్నం అన్నారు.ఈ మేరకు గురువారం ఒక ప్రకటన ధ్వారా వివరాలు వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ. 410. 72 కోట్లు లక్ష్యానికి గాను 418. 82 కోట్లు (101. 57) లక్ష్యం సాధించింది. రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. త్రైమాసిక పన్నులలో రూ. 73. 02 కోట్లు, జీవిత కాల పన్నులలో రూ. 291. 17 కోట్లు, పీజుల ద్వారా రూ. 22. 55 కోట్లు, సర్వీసు చార్జీల ద్వారా రూ. 4. 99 కోట్లు తనిఖీల ద్వారా రూ. 27. 09 కోట్లు మొత్తం కలిపి రూ. 418. 82 కోట్లు లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. పన్ను చెల్లించని మరియు నిబంధనల ఉల్లంఘించిన వాహనాల పై ఎప్పటికపుడు ప్రత్యేక తనిఖీలను నిర్వహించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో కృషి చేసిన ప్రతి అధికారులకు సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.