విశాఖ నగరంలో ఏప్రిల్ 15 న శ్రీ హనుమత్ విజయోత్సవ బైక్ ర్యాలీ, శోభా యాత్ర - వేలాదిమంది తో ఎన్ ఏ డి నుంచి బీచ్ రోడ్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతం పార్క్ హోటల్ జంక్షన్ నుంచి కాళీ మాత ఆలయం వరకు శోభా యాత్ర - యాత్ర లో పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు పాల్గొని - ఆదర్శ మూర్తి, హనుమ జీవితాన్ని ప్రజలకు తెలియజేయడమే బైక్ ర్యాలీ శోభాయాత్రల ఉద్దేశం. ఈ నెల 15 వ తేదీ శనివారం సాయంత్రం విశాఖ నగరం కాషాయ ధ్వజాలతో కళకళలాడనుంది.
యువతకు ఆదర్శ దైవమైన జై హనుమాన్ నినాదాలతో హోరెత్తనుంది. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ శ్రీ హనుమాన్ జీవితాన్ని మరింతగా జనంలోకి తీసుకువెళ్లి, వారిని జాగృతం చేసేందుకు భారీ బైక్ ర్యాలీ దానికి కొనసాగింపుగా బీచ్ శోభా యాత్ర లను జరుపుతోంది. ఎన్ ఏ డీ సమీపం లోని కరాసా పెట్రోల్ బంక్ వద్ద నుంచి ఈ బైక్ ర్యాలీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై ఊర్వశీ జంక్షన్, నంద గిరి నగర్, ద్వారకా నగర్, గురుద్వారా, సీతమ్మ ధార, ఇసుక తోట, ఎం. ఏ. పీ. డబుల్ రోడ్, ఉషోదయ, కామత్ హోటల్ జంక్షన్ ల మీదుగా పార్క్ హోటల్ జంక్షన్ ను చేరుకుంటుంది. ఇందులో పాల్గొనే వారు అరగంట ముందే కరాసా పెట్రోల్ బంక్ వద్ద కు చేరుకోవాలి. వీరికి హనుమాన్ జెండాలను అక్కడే అందజేస్తారు.
15 కిలోమీటర్లకు పైగా సాగే బైక్ ర్యాలీ పార్క్ హోటల్ జంక్షన్ కు సాయంత్రం ఐదు గంటలకు చేరుకుంటుంది. వెంటనే అక్కడనుంచి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి కాళీమాత ఆలయం వరకూ శ్రీ శ్రీ రామ హనుమాన్ల నినాదాలతో, కాషాయ ధ్వజాలతో ఈ యాత్ర కొనసాగుతుంది. యువతీ, యువకులు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు, యువతీ యువకులు కు ఆదర్శ మూర్తి శ్రీ హనుమాన్. ఆయన జీవితాన్ని, పాటించి చూపిన నిబద్ధతతో కూడిన వినయ విధేయత లను, స్నేహ ధర్మం విలువను అందరూ తెలుసుకోవాలి. పనిలో వేగానికి శ్రీ హనుమాన్ ఒక ఉదాహరణ, అపారమైన శక్తి దేహ దారుడ్యం వున్నప్పటికీ వాటిని కేవలం ఆశయ సాధనకు, సమాజ హితానికీ తప్ప స్వార్థనికి, విధ్వంసాలకు వినియోగించ రాదని ప్రవచించిన మహాముని. శ్రీ రామ భక్త హనుమాన్ శోభా యాత్ర లో పాల్గొన డాన్ని ధర్మం కార్యం నిర్వహించే అవకాశం గా భావించి, పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుతున్నాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa