నూతన ఎస్పీగా తుహిని సిన్హా నిన్న బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే విధంగా సేవలందిస్తానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని జిల్లా ఎస్పీ వెల్లడి. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే, అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన ఎస్పీగా తుహిన్ సిన్హా బుధవారం నాడు తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన నేను మొదటి పోస్టింగ్ విశాఖపట్నం గ్రేహౌండ్స్ తర్వాత నర్సీపట్నం ఎస్పీగా అటు తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా అడిషనల్ ఎస్పీగా పది నెలలు బాధ్యత వహించానని, గిరిజన ప్రాంతంలో ప్రతి ఆటుపోట్లు తీసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే విధంగా నా యొక్క సేవలు అందిస్తానని ఆయన అన్నారు.
అదే విధంగా నిరుద్యోగులకు ఉపాధి దిశగా ఉపాధి కల్పిస్తానని, గిరిజన ప్రాంతాల్లో సుగుంద ద్రవ్యాలు, పసుపు, మిరియాలు, పప్పులు, స్ట్రాబెర్రీ ఆపిల్, ద్రాక్ష మరియు తదితర వాణిజ్య పంటలకు నా వంతు కృషి చేస్తానని, ఏజెన్సీ ప్రాంత వాసులకు హామీ ఇస్తున్నానని ఆయన తెలియజేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిరుద్యోగం లేకుండా చూస్తానని, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేటట్లు చర్యలు తీసుకుంటానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన జిల్లా గా ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాంతంలో పరిశ్రమలు పెద్దపెద్ద స్టాల్స్ మరియు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి కాపీ పరిశ్రమలు రావలసిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో చర్చించి ఉన్నత అధికారులకు లేఖ రాస్తానని కూడా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకు, జి. మాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్లు, జిల్లాకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.