జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో నర్సీపట్నం జనసేన పార్టీ కన్వీనర్ రాజాన వీర సూర్యచంద్ర బుధవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జనసేన పార్టీ బలోపేతంపై చర్చలు జరిగాయి. నియోజకవర్గంలో సమస్యలను మనోహర్ దృష్టికి సూర్యచంద్ర తీసుకువెళ్లారు. అనంతరం సూర్య చంద్ర మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడే విధంగా మనోహర్ దిశా నిర్దేశం చేశారని తెలిపారు.