సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా కొన్ని చోట్ల కొందరు అంధ విశ్వాసాలను వదలడం లేదు. తాజాగా, ఓ వ్యక్తి చిన్నారికి వేడి పాలతో స్నానం చేయించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బాధను ఓర్వలేక ఆ చిన్నారి గుక్క పెట్టి ఏడుస్తున్నా అతను ఆపకపోవడం మనం వీడియోలో చూడొచ్చు. యూపీ బనారస్ ప్రాంతాల్లో నిర్వహించే కరాహ పూజలో భాగంగా ఇలా చేస్తారని తెలుస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.