ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 4.37 గంటలకు మలుకు ప్రావిన్స్‌లోని తనింబర్ దీవుల్లో భూమి కంపించింది. భయంతో ప్రజలు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది. ఇండోనేషియాలో వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతీ నెల ఎక్కడో చోట భూకంపం రావడం సాధారణంగా మారింది.