గుంటూరు సర్వజనాసుపత్రిలో 20 మంది బుధవారం కోవిడ్ చికిత్స పొందుతున్నారు. వీరి కోసం ప్రత్యేక పడకలను అందుబాటులోకి తెచ్చారు. జనరల్ మెడిసిన్ విభాగం వైద్యుల పర్యవేక్షణలో వీరికి వైద్య సేవలు అందిస్తున్నారు. గర్భిణుల కోసం కుటుంబ సంక్షేమ విభాగాన్ని కేటాయించారు. అత్యవసర విభాగం వద్ద ఏర్పాటు చేసినా కౌంటర్ వద్ద కోవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి పరీక్షలు చేస్తున్నారు.