జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా చేపట్టే మెగా పీపుల్స్ సర్వే మొదటి వారం ఫలితాలు ప్రభుత్వం పేదలకి మేలు చేస్తుంది అనడానికి ఉదాహరణ అని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అన్ని వర్గాల నుంచి వైయస్ జగన్ ప్రభుత్వానికి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోందన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు ప్రజల వద్దకు వెళ్లిన పార్టీయే లేదని, వైయస్ఆర్ సీపీ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పాలనను వివరిస్తోందన్నారు.