రాష్ట్రంలోనే కాకుండా, దేశంలో కూడా సీఎం జగన్ సంక్షేమ రథసారధిగా గుర్తింపు పొందారని వైయస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. సంక్షేమంతో అన్ని రంగాల్లో ఏపీ దూసుకుపోతోందన్నారు. వైయస్ జగన్ పాలనతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇది జగనన్నపై ఉన్న నమ్మకం..ఇదొక చరిత్ర అన్నారు. ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం వైయస్ఆర్సీపీ చేస్తుందని చెప్పారు. గ్రోత్ రేట్లో దేశంలోనే ఏపీ ముందుస్థానంలో ఉందన్నారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడారు.