ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్ర విచారణ సంస్థలపై శనివారం మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలతో పాటు న్యాయస్థానాలకు సమర్పించే అఫిడవిట్లలోనూ అబద్ధాలు పొందుపరుస్తున్నారని ఆరోపించారు. నిరాధార ఆరోపణలతో తమను వేధింపులకు గురిచేస్తున్న సీబీఐ, ఈడీలపై దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రధాని మోదీకి సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు నేను వెయ్యి కోట్లు అందించానని చెబితే ఆయనను అరెస్టు చేస్తారా? అంటూ నిలదీశారు.