మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన చేశారు. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో భాగంగా ప్రజల తరపున స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొంటానని ప్రకటించారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో లోపల ఏం జరుగుతుందో బయటపెడతామని అన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నిర్వహించిన 'ఉక్కు సంకల్ప పాదయాత్ర'లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు జరిగిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని జేడీ స్పష్టం చేశారు.