వేసవి వచ్చిందంటే లిచీ పండ్లు మార్కెట్లో సందడి చేస్తాయి. ఈ పండ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అధిక ఒత్తిడి తగ్గించడంలో సహా శరీరంలో ఇమ్యూనిటీ పెంచుతుందని చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగుతాయి. లిచీలో ఫైబర్, నీటి శాతం ఎక్కువ. దీంతో బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఎముకలు బలంగా ఉంచేందుకు లిచీ తినాలని సూచిస్తున్నారు.