కొంతమంది పోలీసులు తమ అధికారాలతో సామాన్యులపై జులుం ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటకి వచ్చింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో దళితులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. దాదాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్ ని పోలీసులు తొలగిస్తుండగా, ఎందుకు తొలగిస్తారని ఓ దళితుడు ప్రశ్నించాడు. దీంతో పోలీసులు అతడిని చితకబాదారు.