ముంబైలో నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో విషాదం నెలకొంది. బీజేపీ-శివసేన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మండుటెండలో నిర్వహించడంతో ప్రజలు అల్లాడిపోయారు.పెద్ద LED స్రీన్లు, సౌండ్ సిస్టమ్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు, నీడనిచ్చే వసతి మాత్రం కల్పించలేదు. దీంతో సుమారు 600 మంది వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చేరారు. వారిలో ఇప్పటి వరకు 13మంది మరణించారు. ఆస్పత్రిలో ఉన్నవారిని సీఎం ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్ పరామర్శించారు.