దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 9,111 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కు చేరింది. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,31,141కు చేరింది.