వెస్ట్ బెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో CBI విచారణలో భాగంగా TMC MLA జిబాన్ కృష్ణ సాహాను అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు ముగ్గురు TMC నేతలు అరెస్ట్ అయ్యారు. దీంతో సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఇదిలా ఉండగా, సీబీఐ దాడుల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జిబాన్ వాష్‌రూమ్‌కు అనుమతి తీసుకుని తన ఫోన్లను చెరువులో విసిరేయగా అధికారులు షాకయ్యారు.