నడిరోడ్డుపై యువకుడిని కాల్చి చంపిన ఘటన పాకిస్థాన్లోని కరాచీలో జరిగింది. ఓ షాపులో నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు తమపై నిఘా పెట్టి, పక్కన దుకాణంలో దాక్కున్న వారిపై కాల్పులు జరిపారు. ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఇంతలో బైక్పై పారిపోతున్న యువకుడిపై ఏకధాటిగా కాల్పులు జరపటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నమోదయ్యాయి.