అమెరికాలో 21 ఏళ్ల మరియా క్షయ వ్యాధికి చికిత్స కోసం ఆస్పత్రికి రాగ వైద్యుడు కార్ల్ టాంజ్లర్ ఆమెను కలిశాడు. చికిత్స అందించే క్రమంలోనే ఆ వైద్యుడు యువతితో సన్నిహితంగా మెలిగాడు. ఆ తర్వాత వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో ఆ మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులు మహిళ మృతదేహాన్ని సమాధి చేసిన తర్వాత, టాంజ్లర్ సమాధి నుంచి మృతదేహాన్ని తీశాడు. ఆ తర్వాత ఆ మృతదేహంతో ఏడేళ్లు గడిపాడు. ఈ విచిత్రమైన సంఘటన వైరల్గా మారింది.