గుజరాత్ లోని రాజ్ కోట్ లో దారుణం చోటుచేసుకుంది. దేవుడి మీద భక్తితో హేముభాయ్ మక్వానా(38), హన్సాబెన్(35) అనే దంపతులు బలిపీఠం వంటి పరికరాన్ని తయారు చేసుకొని తమ తలుల నరుక్కున్నారు. పూజ కోసం ఏర్పాటు చేసిన మంటల్లో ఈ తలలు దొర్లి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు. తమ వృద్ధ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూసైడ్ నోట్ లో కోరారు.