నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ పార్టీ నేతలు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా వింజమూరులోని టీడీపీ మండల అధ్యక్షుడు గొంగటి రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ... వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని పేర్కొన్నారు. వింజమూరులో 30 పడకల ఆసుపత్రి, రూ.6కోట్లతో మోటచింతలపాలెం దగ్గర 132కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు, మలపరాజు వాగు బ్రిడ్జి, రూ.9కోట్లతో 25కిలోమీటర్ల సీసీరోడ్లు, కొండాపురంలో కామధేను ప్రాజెక్టు ఇలా అనేక ప్రాజెక్టులు టీడీపీ హయాంలో తాము తెచ్చిన హామీలేనని తెలిపారు. టీడీపీ చేసిన అభివృద్ధి పనులు డాక్యుమెంట్ రూపంలో ప్రజలకు అందిద్దాం మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు.