కడప నగరంలో ఈ నెల 18వ తేదీ మంగళవారం ఉదయం జోన్-5కు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10గంటలకే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభాప్రాంగణానికి చేరుకుని జోన్-5 ప్రతినిధులతో చర్చించి దిశానిర్దేశం చేస్తారన్నారు. జోన్-5లోని ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు, 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఐదు జిల్లాల అధ్యక్షులు హాజరవుతారని అన్నారు. రాబోయే ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు నియోజకవర్గం, క్ల్లస్టర్ యూనిట్ ఇన్చార్జి, బూత్ ఇన్చార్జిలకు శిక్షణ ఇచ్చేందుకు దిశ నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.