కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండల పరిధిలోని దైవందిన్నెలో వాల్మీకుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పార్థసారథి మాట్లాడుతూ..... ఏళ్లతరబడి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని అన్యాయం చేస్తున్నారని, దీనిపై ఉద్యమించాలని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలకు వాల్మీకులు గుర్తుకొస్తారని విమర్శించారు. అధికారంలో ఉన్న వైసీపీ అసెంబ్లీలో ఓ వైపు ఎస్టీ రిజర్వేషన కోసం తీర్మానం చేస్తూ మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, వైజాక్ ప్రాంతాల్లో ఆపార్టీ నాయకులు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని ఆందోళనలు చేస్తారని ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన కోసం అసెంబ్లీలో తప్పుడు బిల్లుపెట్టినట్లే పెట్టి వాల్మీకులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.