ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మ తిట్టిందని, విద్యార్థిని ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 17, 2023, 03:00 PM

శ్రీకాకుళం,లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే...  శ్రీకాకుళం, గుజరాతీపేటకు చెందిన ఆకుల గణేష్‌ శ్రీకాకుళం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన కుమార్తె ఢిల్లీశ్వరి.. ఏవీఎన్‌ఎం స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. త్వరలో పరీక్షలు సమీపిస్తున్నా సరిగ్గా చదవడం లేదని కుమార్తె ఢిల్లీశ్వరిని తల్లి శనివారం రాత్రి మందలించింది. దీంతో అలిగి ఇంటిలో నుంచి బయటకు వెళ్లిపోయిన ఢిల్లీశ్వరిని వెతికి ఇంటికి తీసుకువచ్చా రు. రాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు నిద్ర నుంచి లేచిన తల్లికి కుమార్తె కనిపించలేదు. ఎంతవెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం దత్తాత్రేయ ఆలయం సమీపంలో నాగావళి నదిలో ఢిల్లీశ్వరి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని వారికీ  సమాచారం అందింది. దీంతో తండ్రి గణేష్‌ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com