పేద పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పోషక ఆహారాలు రోడ్డున పడేశారు. రేపల్లె పట్టణం రింగు రోడ్డు వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే రాగి పిండి, జొన్న పిండి, అటుకుల ప్యాకెట్లు రోడ్డు మీద పడేయడంతో కొంత మంది వాటిని తీసుకుని అమ్ముకుంటున్నారు. పోషక లోపం సమస్యను అధిగమించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైఎస్సార్ సంపూర్ణ పోషక పథకం ఇలా రోడ్డు పాలు అవ్వడం గమనార్హం.