ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 12న అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 14న అంబేడ్కర్ జయంతి అనంతరం శుక్రవారం రాత్రి విగ్రహాన్ని నిందితులు పెకిలించి పందికోడులో విసిరేశారు. వీరిలో ముగ్గురు మైనర్‌లని, ఎనిమిది మంది మేజర్‌లని అన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని అపహరించి అల్లర్లు సృష్టించాలనే లక్ష్యంతోనే ఇటువంటి ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. ముత్యాల దుర్గా గణేష్(22), శతనాల భాస్కరరావు(20), తోట వెంకటేశ్వర రావు(22), కర్ణటి నరసింహమూర్తి(20), విందాబత్తుల శ్రీనివాసకల్యాణ్ (20), నరమామిడి ప్రశాంత్‌కుమార్ (19), దాసరి నరేష్ (22), కర్ణటి వెంక టేష్ (19) మేజర్లనీ, మరో ముగ్గురు బాలురని వివరించారు. వీరంతా పెదనిండ్రకొలను గ్రామానికి చెందినవారేనన్నారు. నిడమర్రు ఇన్‌చార్జ్ ఎస్సై వి.వెంకటేశ్వరరావు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు ఛేదించిన కాంతారావు, నాగరాజు, శ్రీనివాస్, జగపతిబాబులను అభినందించారు.