ప్రశాంత్ నగర్ కాలనీలో ఔట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రచార బేరి కార్యక్రమంలో సిపిఐ , సిపిఎం పార్టీల డిమాండ్ చేశారు. సిపిఎం- సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారభేరి 4 వ రోజు చిత్తూరు ప్రశాంత్ నగర్ కాలనీ లో సోమవారం జరిగింది.
ఈ సందర్భంగా కాలనీ వాసులకు పాంప్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి యస్. నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు లు మాట్లాడుతూ మోడీని గద్ద దించండి, దేశాన్ని రక్షించండి నినాదాలు చేపట్టారు.
ప్రచారభేరి కార్యక్రమాన్ని ప్రశాంత్ నగర్ కాలనీ ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేంద్రన్, సిపిఐ నాయకులు , మణి, దాసరిచంద్ర, జయలక్ష్మి , రవి, విజయగౌరి, జమిలాబి, రఘు, బాలాజి రావు, నాగరత్నమ్మ, దేవి, నూర్జాన్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.