ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఆయన శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో సచివాలయం 1 పరిధిలో 177వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా ప్రజలకు వర్తించిన పధకాల ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత ప్రభుత్వం పాలన వ్యత్యాసాలు వివరించారు.
ఈ సందర్భంగా ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను వివరించటం, ఇంకా ఏమైనా సమస్యలు వుంటే తెలుసుకుని అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ, నేరుగా ప్రజలతో కలసి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ఇంకా మెరుగైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని, ప్రతి ఇంటికి వెళ్లి వారికి ముఖ్యమంత్రి పంపిన లేఖను అందజేస్తూ, మూడేళ్ళలో దేవుడి దయతో, మీ అందరి చల్లని చూపులతో మంచి చేసామని, ఇక ముందు కుడా మంచి చేస్తామని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గోరపల్లి శివ, జెసిఎస్ మండల ఇంచార్జ్ బొంతుల వెంకటరావు, మేలాస్త్రి అప్పారావు, గొరపల్లి రవి, స్టేట్ డైరెక్టర్ దమ్ము రమణ, వార్డు సభ్యులు, సోషల్ మీడియా ప్రతినిధులు కర్రీ దేవుడు బాబు, అడిగర్ల సంతోష్, మండలంలో ఉన్న ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయం కన్వీనర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.