రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్ని మాపక సేవల శాఖ, నంద్యాల అగ్నిమాపక కేంద్రము వారు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం నందు గల సుజల పైప్స్ ప్రైవేటు లిమిటెడ్లో సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి బి. యోగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. నంద్యాల పరిశ్రమ నందు పని చేయుచున్న ఉద్యోగులకు, కార్మికులకు అగ్ని మాపక శాఖ వారోత్సవాలను జరుపుటకు గల ప్రాముక్యతను తెలియజేస్తూ పరిశ్రమల నందు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు, ఆయిల్ ప్రమాదాలు జరిగినప్పుడు మరియు గ్యాస్ లీకేజి జరిగినప్పుడు సంభవించే అగ్నిప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి మరియు వాటిని ఎలా అదుపు చేసే పద్దతులను ప్రాక్టికల్ డెమో ద్వారా చేసి చూపించారు. నంద్యాల జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి యెన్ జయన్న , సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి బి. యోగేశ్వర రెడ్డి మరియు సిబ్బంది పాల్గొనడమైనది.