వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌కు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ మరోసారి విచారించనుంది. అయితే మధ్యాహ్నంలోపు పిటిషన్‌పై తీర్పు రానుండగా, ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని అవినాష్‌కు సీబీఐ నోటీసులు పంపింది. దీంతో ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.