ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 18,19, 20, 26, 27 తేదీల్లో ఈ క్యాంప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సచివాలయ శాఖ, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆధార్ అప్డేట్ చేసుకోనివారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పదేళ్లలో ఒక్కసారైనా ఆధార్ అప్డేట్ చేసుకోని వారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.53 కోట్లమంది ఉన్నారు.