ఓ దొంగ సీఎం పక్కన కూర్చుని భోజనం చేశాడు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం సిద్ది జిల్లాలో ఓ కార్యక్రమంలో ప్రజలతో కలసి విందులో పాల్గొన్నారు. అక్కడ అరవింద్ గుప్తా అనే వ్యక్తి సీఎం పక్కనే కూర్చుని భోజనం చేశాడు. కాగా, అరవింద్ కలప దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు. సీఎం పక్కన ఓ దొంగ కూర్చుని భోజనం చేయడం విమర్శలకు దారితీసింది. ఇక్కడ భద్రత వైఫల్యం సృష్టంగా కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.