చెత్త కుప్పలో దొరికిన శిశువుకు తన ఆస్తిని రాసిచ్చేందుకు ముందుకొచ్చింది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ. అలీగఢ్ జిల్లాలో నివాసముండే లత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఓ చెత్త కుప్పలో ఏడుస్తున్న నవజాత శిశువు కనిపించింది. ఆ బిడ్డను ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి పాలు పట్టింది. బిడ్డను దత్తత తీసుకొని, తన ఆస్తిలో సగ భాగాన్ని ఇప్పుడే పాప పేరు మీద రాస్తానని లత ముందుకొచ్చింది.