మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఓ వ్యాపారి పారిశుద్ధ్య కార్మికులపై సోమవారం తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. వ్యాపారవేత్త మహేష్ పటేల్ ఇంటి వద్ద కార్మికులు చెత్త సేకరిస్తుండగా తడి, పొడి చెత్త వేరు చేయనందున అతని భార్య, కుమారుడితో వాగ్వాదానికి దిగారు. దీంతో మహేష్ తుపాకీతో వారిని బెదిరింపులకు గురి చేయగా, వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఇరువర్గాలతో చర్చించినట్లు తెలుస్తోంది.