కర్ణాటక ఎన్నికల్లో హొసకోటె నియోజకవర్గం నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి MTB నాగరాజు తన ఆస్తులను ప్రకటించారు. 9వ తరగతి మాత్రమే చదివిన ఆయన రూ. 1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో తన భార్య పేరిట రూ. 536 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అయితే ఇద్దరి పేరిట రూ. 98.36 కోట్ల రుణాలున్నట్లు పేర్కొన్నారు. అయితే 2018లో ప్రకటించిన ఆస్తులతో పోలిస్తే రూ. 500 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది.