నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలోని కోళ్లమిట్ట లో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కోళ్లమిట్టకు చెందిన రజితకు కొడవలూరు మండలం కమ్మపాళెంకి చెందిన వెంకటహరితో 2010లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల కిందట భార్యాభర్తల మధ్య వివాదాలతో విడివిడిగా ఉంటున్నారు. రజిత కోళ్లమిట్టలో నివాసం ఉంటూ పోర్టు పరిధిలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఏమైందోఏమో ఆదివారం సాయంత్రం పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్లిన సమయంలో రజిత తన అపార్ట్‌మెంట్ పడకగదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఇంటికి వచ్చిన పిల్లలు ఎంత పిలిచినా తల్లి పలక్కపోవడంతో పక్కనే ఉన్న వారిని పిలిచి చూశారు. ఆత్మహత్య విషయం గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. రజిత తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.