ఒంగోలు జిల్లా, దుద్దుకూరు ప్రాథమిక వైద్యశాలలో పలుమార్లు పాములు, విషపురుగులు సంచరిస్తున్నాయని, తాము భయంగుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నామని, ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని స్టాఫ్ నర్సుగా విధులు నిర్వరిస్తున్న వారు వాపోతున్నారు. ఐతే తాజాగా స్టాఫ్ నర్సుగా విధులు నిర్వరిస్తున్నలలిత పాముకాటుకు గురైంది. ఆదివారం విధుల్లో ఉన్న లలిత ఆసుపత్రిలోకి వచ్చిన పాము కాటు వేయడంతో అక్కడి సిబ్బంది ఆమెను ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఇక్కడి అధికారులు తగిన సమయంలో వైద్యం అందించడంలో బాధితురాలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం నర్సుల అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు బాధితురాలిని పరామర్శించారు.