కృష్ణా జిల్లా, నిడుమోలు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... పమిడిముక్కల మండలం మేడూరు గ్రామానికి చెందిన పండ్ల వ్యాపారి పురిటిగడ్డ రాజేష్ తన స్నేహితుడు తరకటూరు పోతురాజుతో కలసి పండ్ల కొనుగోలు నిమిత్తం మచిలీపట్నం బైక్పై వెళ్తుండగా, నిడుమోలు వద్ద మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బస్సు అతివేగంతో బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు. స్నేహితుడు పోతురాజు కు గాయాలైనాయి. గాయపడిన పోతురాజును వైద్యసహాయం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.