ఆదోని పట్టణంలో విషాదం అలుముకుంది. యుక్త వయస్సుకి వచ్చిన యువకుడు సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే...... పట్టణంలోని హనుమాన నగర్‌కు చెందిన భీమయ్య కుమారుడు నాగరాజు (18) సోమవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి చౌదరిబావిలో ఈతకు వెళ్లాడు. ఈత రానప్పటికీ నీటిలో దూకాడు. నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు ఇంటర్ వరకు చదివి వివాహాలకు వాయిద్యాలు వాయించేవాడని తెలిపారు. సాయంత్రం మృతదేహం వెలికి తీశారు.