రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో 40 రోజులుగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఐతే నేడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు సంఘం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.