ప్రకాశం జిల్లా, వెలిగండ్ల ప్రాంతంలోని అధికార పార్టీ నాయకులూ వలంటీర్లపై హుకుం జారీ చేస్తున్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వలంటీర్లు, గృహసారథులు, సచివాలయ సిబ్బందితో వైసీపీ మండల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వలంటీర్లు మా మాట వినడం లేదని, కనీసం విలువ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ నాయకుడు, సొసైటీ చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ..... వలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. మీకు అప్పగించిన 50 ఇళ్ల సమాచారాన్ని మాకు తెలియజేయాలని హుకుం జారీ చేశారు. పార్టీ కోసం పనిచేయకపోతే తొలగిస్తామని హెచ్చరించారు.