పలమనేరు ఎన్జీవో హోం వద్ద మరియు గంగవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద
టీబీ వ్యాధితో బాధపడుతున్న వారికి పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక దాతలు శ్రీపురం సీతారామయ్య, శేఘు నరసింహులు శెట్టి బి. నాగరాజు గుప్తా ల సహకారంతో ఆరు నెలల పాటు నెలకోసారి కందిపప్పు, గోధుమ పిండి, శెనగలు, రాగిపిండి, నూనె, సెనగ గింజలు, కోడి గుడ్లు తదితర పోషకాహారం అందజేసే 5 వ నెల కార్యక్రమాన్ని నిర్వహించారు. మాట్లాడిన వక్తలు వ్యాధి గ్రస్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరింత మందికి సహకారం అందించడానికి సేవా సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం అధ్యక్షులు ఆనందబాబు, పిపీఎస్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పిళ్లై, కార్యదర్శి నరసింహులు, డాక్టర్ నారాయణ స్వామి, వైద్య శాఖ సిబ్బంది జగదీశ్వరి, గౌతమి, విజయకుమార్, జ్యోతీశ్వర్, పిపీఎస్ సభ్యులు, నారాయణ రెడ్డప్ప, సుబ్రహ్మణ్యం , విజయకుమార్, సాoభయ్య శ్యామ్ రాజ్, రామచంద్ర, నిసార్, పొన్ముడి, ధర్మయ్య , పాండురంగ, మురళి తదితరులు పాల్గొన్నారు.