జామి మండలంలోని భీమసింగి గ్రామంలో గోస్తని నది తీరాన ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో మంగళవారం నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలు నడుమ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణ, మంగళ హారతులు, భజనలు, కీర్తనలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం బాబా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.